త్వరలోనే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. డిసెంబర్ 5 తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది.దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ మధ్యనే బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ మంచి సక్సెస్ ని సాధించింది.నార్త్ లో ఒక సౌత్ హీరో సినిమా ట్రైలర్ లాంచ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు.
ఈ సక్సెస్ కి చిత్ర యూనిట్స్ సైతం షాక్ అయ్యారు. దాదాపు రెండు లక్షల మందికి పైగా ఫ్యాన్స్ ఈవెంట్ కి వచ్చారు. నార్త్ లో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవటంతో ఇప్పుడు సౌత్ లో కూడా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. తెలుగు రాష్ట్రాలు, కేరళలో ఎలాగూ అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే సౌత్ లో మొదట చెన్నైలో ఈవెంట్ చేస్తున్నారు. తాజాగా ఈవెంట్ డీటెయిల్స్ కూడా ప్రకటించారు మూవీ టీం.
నవంబర్ 24 సాయంత్రం ఐదు గంటలకి చెన్నైలోని సాయిరాం ఇంజనీరింగ్ కాలేజీలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ చేయబోతున్నారు. ఈవెంట్ పై ఇప్పటినుంచే అంచనాలు నెలకొన్నాయి. అదే రోజు పుష్ప 2 సినిమాలోని శ్రీ లీల చేసిన స్పెషల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించగా మలయాళి నటుడు ఫహద్ ఫాజిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
పుష్పరాజ్, బన్వర్ సింగ్ షెకావత్ మధ్య జరిగే యాక్షన్ డ్రామ చూడటం కోసం జనాలు తెగ వెయిట్ చేస్తున్నారు. అలాగే సినిమాలో శ్రీవల్లి పాత్ర ట్రాజడీగా ముగుస్తుందని, ట్రైలర్ లో దీనికి సంబంధించిన క్లూ కూడా కనిపించిందని టాక్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రేక్షకుల ప్రశ్నలన్నింటికీ డిసెంబర్ 5న సమాధానం దొరకబోతుంది ఈ సినిమా కోసం దేశంలో లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుష్పరాజ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనటంలో ఆశ్చర్యం లేదు.