YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకపోయినా అసెంబ్లీలో అధికార నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈయన కౌంటరిస్తూ మీడియా సమావేశాలలో పాల్గొంటున్నారు. ఇలా మీడియా సమావేశంలో భాగంగా తాడేపల్లిలో ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చంద్రబాబు గురించి అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి మరోసారి చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వరుస ప్రశ్నలు వేశారు.
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ ఫిక్స్ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని తెలిపారు. ఆయన సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికే వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. గతంలో కూడా ఎన్నో తప్పుడు హామీలను ప్రకటించిన బాబు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు ప్రస్తుతం కూడా ఆయన ఇచ్చిన మాట పై నిలబడలేకపోతున్నారని ఆయన ఈ జీవితంలో మారరు అంటూ జగన్ మండిపడ్డారు.
ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో మా ప్రభుత్వ హయాంలో అప్పులు ఎక్కువగా జరిగాయని తెలియజేశారు కానీ బడ్జెట్ సమయంలో మాత్రం అప్పులను చాలా తక్కువ చేసి చూపించారని జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 6.46 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి ఉన్నాయన్నారు.
చంద్రబాబు నాయుడు మేము 14 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లినట్లు తప్పుడు ప్రచారం చేశారు కానీవాస్తవాలు ఏమిటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయన్నారు. ఇలా రాష్ట్ర అప్పులపై చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేయటం భావ్యం కాదు. కేవలం అప్పుల విషయంలో మాత్రమే కాదు కాగ్ రిపోర్ట్ పై కూడా ఈయన తప్పుడు ప్రచారాలు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.