YS Sharmila: వైయస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో మహిళల గురించి అలాగే పార్టీ నేతల గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి అనుచిత పోస్టులు చేస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఇక ఈ విషయంపై షర్మిల కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు.
గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా నన్ను నా తల్లి అలాగే సునీతపై కూడా అనుచిత పోస్టులు చేస్తూ ఎంతో నీచాతి నీచంగా మాట్లాడారు. ఇలాంటి వారందరిని తప్పనిసరిగా అరెస్టు చేయాలి ముఖ్యంగా ఇలాంటి పోస్ట్లు చేయిస్తున్నటువంటి సజ్జల భార్గవ్ ను కూడా పోలీసులు అరెస్టు చేయాలంటూ ఈమె డిమాండ్ చేశారు.
సజ్జల భార్గవ్ సోషల్ మీడియా హెడ్ ఆయన సమక్షంలోనే ఇలాంటి పోస్టులను కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ముందు తనని అరెస్టు చేస్తే మిగిలిన వారందరూ కూడా అలర్ట్ అవుతారని తెలిపారు. ఇక ఈ సోషల్ మీడియా పోస్టులు వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం కూడా ఉంది మరి ఎందుకు పోలీసులు ఆయనని ప్రశ్నించలేదు అంటూ షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
ఇలాంటి పోస్టులు చేసేవారినే కాదు చేయించే పెద్ద తలకాయలను కూడా అరెస్టు చేస్తేనే ఇలాంటి వాటికి అడ్డుకట్టు వేసినట్టు అవుతుంది. సజ్జల భార్గవ్ ఏ ప్యాలెస్ లో దాగున్న అంటూ పరోక్షంగా ఆయన జగన్ ఇంట్లో ఉన్నా కూడా పోలీసులు అరెస్టు చేసి తీరాలి అంటూ షర్మిల తెలిపారు.నేను కేసు పెట్టాలి అంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా కొంత రాజకీయ ఆరోపణలు ఉంటాయి. అది రాజకీయ రంగు పులుముకుంటుందనీ షర్మిల తెలియజేశారు. ఇక వైయస్ వివేక చిన్నాన్న హత్య కేసు విషయంలో ఇప్పటికైనా సునీత సౌభాగ్యమ్మకు న్యాయం చేయాలని ఈమె డిమాండ్ చేశారు.