Shilpa Ravi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మెగా అభిమానుల మద్దతు పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానుల మద్దతు లభించింది అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాని వైసిపి అభిమానులు పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు.
తాజాగా పుష్ప సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ పై వైకాపా నాయకుడు స్పందించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. మరి ఆ నాయకుడు ఎవరు ఏంటి అనే విషయానికొస్తే ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ ప్రాణ స్నేహితులు నంద్యాల వైకాపా నేత శిల్పా రవి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ సినిమాపై స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా శిల్పా రవి అల్లు అర్జున్ పుష్పా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా డిసెంబర్ ఐదో తేదీ వైల్డ్ ఫైర్ చూడటానికి ఆసక్తిగా ఉన్నాను అంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. ఇలా శిల్ప రవి చేసిన ఈ పోస్టుకు అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి రాజకీయపరంగా చర్చ మొదలైంది.
నిజానికి అల్లు అర్జున్ మెగా కుటుంబానికి మధ్య విభేదాలు రావడానికి శిల్ప రవి కారణమని చెప్పాలి. అల్లు అర్జున్ శిల్ప రవి ప్రాణ స్నేహితుడు కావడంతో తనకు మద్దతుగా ఈయన నంద్యాల వెళ్లి కేవలం తన స్నేహితుడిని కలిసి వచ్చారు తప్ప ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదు. ఈ క్రమంలోనే అప్పటినుంచి మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ పూర్తిగా దూరం పెట్టి రావడమే కాకుండా మెగా అభిమానులు సైతం అల్లు అర్జున్ సినిమాలపై వ్యతిరేకత చూపిస్తున్న విషయం తెలిసిందే. మరి డిసెంబర్ ఐదో తేదీ రాబోతున్న అల్లు అర్జున్ తన సినిమాతో మెగా అభిమానులకు ఎలాంటి సమాధానం చెబుతారు అనేది తెలియాల్సి ఉంది.
Loads of love and best wishes .. can’t wait to watch the wild fire on screen @alluarjun 🤗🤗 #Pushpa2TheRule pic.twitter.com/FBkfGazfut
— Silpa Ravi Reddy (@SilpaRaviReddy) November 20, 2024