Vastu Tips: మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.ఈ క్రమంలోనే మనం ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టాలన్న లేదా నిర్మాణాలు చేపట్టాలన్న తప్పనిసరిగా వాస్తును పరిశీలిస్తాము.ఈ విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణ పనులు అలాగే ఇంటిలో కొన్ని వస్తువులను కూడా అలంకరించుకోవటం ఎంతో శుభ సూచకం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో వస్తువులను అలంకరించుకోవడం వల్ల ఆ ఇంటిలో ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. అలా కాకుండా కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మరి ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదనే విషయానికి వస్తే…
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో నటరాజ విగ్రహం ఉండకూడదు. నటరాజ విగ్రహం ఇంట్లో ఉండటం వల్ల ఇంటిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విగ్రహం ఎల్లప్పుడు డాన్స్ నేర్చుకునే చోట మాత్రమే ఉండాలి. అలాగే యుద్ధం జరుగుతున్నటువంటి పురాతన చిత్రాలు, చిత్రపటాలు ఇంటిలో ఉండకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్కలు తప్ప ఇతర ముళ్లు కలిగినటువంటి మొక్కలను ఇంట్లో ఉండకూడదు.
అలాగే సముద్రంలో మునిగిపోతున్న ఓడలు, వేట చిత్రాలు, పట్టుబడిన ఏనుగుల చిత్రాలు ఏడుస్తూ ఉన్నటువంటి వారి చిత్రాలను ఇంటిలో పెట్టుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయించే సూర్యుడు చిత్రపటం ఇంటిలో ఉండాలి కాని అస్తమించే సూర్యుడు చిత్రం ఉండకూడదు. ఇలాంటివి ఇంటిలో ఉండటంవల్ల ఆ ఇంటిలో అభివృద్ధి కూడా అలాగే ఉండటమే కాకుండా అనేక ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి వస్తువులను ఇంటిలో పెట్టుకోకూడదు.