Pawan Kalyan: సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈయన సినిమాలకు కూడా ఇటీవల కాస్త దూరమయ్యారు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతూ ఉంటాయి.
సినీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారం గురించి వారి క్రష్ గురించి తరచూ వార్తలు వినపడుతుంటాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ కి కూడా ఒక క్రష్ ఉండేదని తెలుస్తుంది క్రష్ అంటే మరి హీరోయిన్ కాదండోయ్ ఆయన క్రష్ మరెవరో కాదు గన్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు గన్ అంటే చాలా పిచ్చి ఉండేదట ఇలా తనకు ఉన్నటువంటి అలవాటు చూసి తన అన్నయ్య వీడెక్కడ నక్సలైట్లలోకి వెళ్ళిపోతాడని భావించి తనకోసం ఒక లైసెన్స్ తీసుకొచ్చి ఇచ్చారని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇలా తన అన్నయ్య గన్ తీసుకురావడంతో అన్యాయం జరిగే ప్రతిచోట ఆ గన్ తో సమాధానం చెప్పాలి అనుకున్నాను. ఇక అన్నయ్య గన్ ఇవ్వగానే ఎప్పుడు దానిని నా పాకెట్లో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. పడుకున్నా కూడా ఆ గన్ నా పక్కన ఉండాల్సిందేనని తెలిపారు. ప్రతిరోజు ఉదయం లేవగానే తాను గన్ చూసి దానికి కిస్ ఇవ్వనిదే నా రోజు మొదలయ్యేది కాదని పవన్ ఒక సందర్భంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాలలో కూడా కొనసాగుతూ వచ్చారు. ఇలా రాజకీయాలలో కొనసాగుతూ నేడు ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా పూర్తిస్థాయి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు.