Pithapuram: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే విజయం సాధించారు నిజానికి ఈ నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేత వర్మ ఎన్నికలలో పోటీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో వర్మ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతగానో కృషి చేసి పవన్ కళ్యాణ్ కు గెలుపు అందించారు.
పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు అప్పట్లో ఒక మాట ఇచ్చారు కానీ చంద్రబాబు మాత్రం మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎమ్మెల్సీ కూడా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి కట్టబెట్టారు. వర్మకు పిఠాపురం టికెట్ విషయంలో అన్యాయం జరిగిందనే చెప్పాలి.
ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో.. పవన్ కల్యాణ్ గెలుపులో ఎవరైనా తన పాత్ర ఉందని భావిస్తే అది వాళ్ల “ఖర్మ” అని నాగబాబు వ్యాఖ్యానించడంతో.. ఆ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ క్రమంలోని ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున భేదాభిప్రాయాలు వచ్చాయని చెప్పాలి. తాజాగా పిఠాపురానికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో పిఠాపురంలోని స్థానిక మహిళ ఒకరు… వచ్చే ఎన్నికలో పోటీ చేయమని వర్మను కోరుతున్నారు.అవును… వచ్చే ఎన్నికల్లో మీరైనా నిలబడండి.. అని ఆ మహిళ వర్మను కోరారు. ఈ సమయంలో “నిలబడతాను” అని ఆమెతో వర్మ నవ్వుతూ సమాధానం చెప్పారు. అనంతరం… జగ్గయ్య చెరువు బాగుపడటం లేదు అని సదరు మహిళ చెప్పగా.. అభివాదం చేసుకుంటూ వర్మ ముందుకు కదిలారు. ఈ వీడియో నిజంగానే పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ అని చెప్పాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మెల్లిగా వ్యతిరేకత వస్తుందనీ తెలుస్తుంది.