Kannappa: కన్నప్ప సినిమాలో రజనీకాంత్ ఎందుకు నటించలేదు… విష్ణు సమాధానం ఇదే!

Kannappa: మంచు విష్ణు కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన డ్రీం ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలోని సుమారు 200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా వచ్చేనెల ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు తరచు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలందరూ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. చిన్న పాత్ర నుంచి మొదలుకొని పెద్ద పాత్ర వరకు స్టార్ సెలబ్రిటీలు నటించారు. ఇక ఈ సినిమాకు ప్రభాస్ ప్రధాన బలం అని చెప్పాలి.

స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా వందల కోట్ల కలెక్షన్స్ రాబడతాయి. ఇక ఈ సినిమాకు ప్రభాస్ బలం అని మంచు విష్ణు భావించడం వల్ల ఆయనని రుద్ర అనే చిన్న పాత్రలో నటించడానికి తీసుకున్నారు. ఇక మోహన్ బాబు ప్రభాస్ మధ్య చాలా మంచి అనుబంధమున్న నేపథ్యంలో విష్ణు అడిగితే కాదనలేక ప్రభాస్ నటించారు. అయితే ఈయన నటించినందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు.

ఇకపోతే అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగమయ్యారు. ఇకపోతే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో రజనీకాంత్ కూడా ఒక చిన్న పాత్రలో చేసి ఉంటే సినిమా క్రేజ్ మరింత పెరిగిపోయేదని అందరూ భావిస్తున్నారు.

ఇక ఇదే విషయం గురించి మంచు విష్ణుకు ప్రశ్న ఎదురయింది.. మోహన్ బాబుగారు రజనీకాంత్ మధ్య ఏరా అంటే పోరా అనే అంత మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు అడిగితే రజినీకాంత్ నో చెప్పే ప్రసక్తే లేదు కానీ రజినీకాంత్ ని ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నకు విష్ణు సమాధానం చెప్పారు. ఈ సినిమాలో రజనీకాంత్ గారు నటించాల్సిన పాత్ర లేదు. ఆయనకు సూట్ అయ్యే పాత్ర లేకపోవడం వల్లే తనని తీసుకోలేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.