మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా.. ఈ చిట్కాలతో సమస్యకు శాశ్వతంగా చెక్!

ఈ మధ్య కాలంలో ఇంట్లో ఎలుకలు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఇంట్లో ఎలుకలకు సంబంధించిన సమస్య శాశ్వతంగా దూరమవుతుంది. లవంగాలను ఉంచిన చోట ఎలుకలు దూరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇంట్లో ఒక్కసారి ఎలుకలు చేరితే వాటిని ఇంటినుంచి బయటకు పంపించడం సులువైన విషయం కాదు.

ఎలుకల వల్ల మనుషులకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలుకలు చేరడం వల్ల ఇంట్లో వస్తువులు సైతం నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. లవంగాల వాసనను ఎలుకలు ఏ మాత్రం భరించలేవు. ఎలుకలు ఉన్న ప్రదేశాలలో లవంగాలు చల్లడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల ఎలుకలు దూరమవుతాయి.

ఎలుకల వల్ల ప్లేగు వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఎలుకల కోసం ఉపయోగించే రసాయనాల వల్ల భారీ స్థాయిలో నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎలుకల్ని తరిమికొట్టేందుకు ఇంట్లో కొన్ని మొక్కల్ని పెంచుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు.

​ఎలుకలు ఇంటికి దూరంగా ఉండాలంటే బాల్కనీలో పుదీనా మొక్కను పెంచాల్సి ఉంటుంది. మెంథాల్ అనే మూలకం పుదీనా మొక్కలో ఉంటుందని చెప్పవచ్చు. పుదీనా ఆకుల సువాసన ఎలుకలకు అస్సలు నచ్చే అవకాశం ఉండదు. ఇంట్లో లేదంటే వంటింట్లో పుదీనా మొక్కను పెంచడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.