Varalakshmi: చిన్నప్పుడే ఐదారుగురు లైంగికంగా వేధించారు…. కన్నీళ్లు పెట్టుకున్న నటి వరలక్ష్మి!

Varalakshmi: వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈమె నటించిన ఈ పాత్రలు మంచి సక్సెస్ కావడంతో అప్పటినుంచి విలన్ పాత్రలలో నటిస్తున్నారు.

ఇలా నేటి తరం లేడీ విలన్ అంటే కేరాఫ్ వరలక్ష్మి అనే పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలలోను లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా వరలక్ష్మి ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా పలు బుల్లితెర కార్యక్రమాలకు కూడా ఈమె జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్గా జీ తమిళ్‌లో ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకి జడ్జ్గా వ్యవహరించింది. ఆ షోలో వరలక్ష్మి శరత్‌కుమార్.. తాను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైనట్లు బాధపడుతూ చెప్పింది. ఆమె తన బాల్యంలో జరిగిన కథను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

కెమీ అనే డ్యాన్స్ కంటెస్ట్ తన కుటుంబ సభ్యులచే నిరాశకు గురైనట్లు చెబుతూ ఎమోషనల్ అయింది. అలా ఇతరులచే లైంగిక వేధింపులకు గురైనట్లు తన కథను ఈ షో ద్వారా తెలిపారు.నేను మీలాగే లైంగిక వేధింపులకు గురయ్యాను. నా తల్లిదండ్రులు (నటుడు శరత్ కుమార్ మరియు ఛాయ) అప్పట్లో తమ సినిమా పనుల్లో బిజీగా ఉండేవారు. కాబట్టి వారు నన్ను ఇతరుల సంరక్షణలో వదిలివేసేవారు. అయితే చిన్నప్పుడు నేను ఐదారు మంది నుంచి ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను.

ఇప్పుడు మీ పరిస్థితి చిన్నప్పుడు నా పరిస్థితి కూడా ఒకటేనని వరలక్ష్మి తెలియజేశారు నాకు పిల్లలు లేరు కానీ నేను తల్లిదండ్రులకు చెప్పే విషయం ఒకటే..తమ పిల్లలకు ‘మంచి స్పర్శ’ మరియు ‘చెడు స్పర్శ’ గురించి నేర్పించాలని అభ్యర్థిస్తున్నానని వరలక్ష్మి కోరింది. అలాగే తనకు కెమెరాల ముందు ఏడ్చడం అలవాటు లేదని అందుకు క్షమించాలి అంటూ కూడా వరలక్ష్మి ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.