అతిగా మజ్జిగ తాగడం వల్ల కలిగే నష్టాలివే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

అతిగా మజ్జిగ తాగడం వల్ల లాక్టోజ్ అసహనం, ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, అతిసారం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు, కొన్నిసార్లు అలర్జీలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మజ్జిగలో లాక్టోజ్ ఉంటుంది, ఇది లాక్టోజ్ అసహనం ఉన్నవారికి జీర్ణక్రియలో ఇబ్బందులు కలిగిస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోటీన్ల వల్ల కొంతమందికి అలర్జీలు రావచ్చు, దీనివల్ల వాంతులు, దద్దుర్లు, కడుపునొప్పి వంటివి రావచ్చు.

కొన్ని మజ్జిగలలో సోడియం ఎక్కువగా ఉంటుంది, ఇది అధిక రక్తపోటు మరియు గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చు. మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ, అతిగా తాగడం వల్ల కేలరీల పరిమాణం పెరుగుతుంది. మజ్జిగలో ఉప్పు వేసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వస్తాయి. మజ్జిగ తాగడం ఆరోగ్యానికి మంచిదే. వేడి చేయకుండా శరీరాన్ని చల్ల బరిచే తత్వం మజ్జిగకు ఉంది. మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఇంకా మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు.

మజ్జిగలో లాక్టోస్ ఉండటం వల్ల గ్యాస్, ఉబ్బరం, పొత్తికడుపులో నొప్పి లాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మజ్జిగ ఎకువగా తీసుకుంటే శరీరంలో కేలరీలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మజ్జిగ తీసుకున్న తర్వాత పాల ఉత్పత్తులను తీసుకుంటే అలర్జీలు పెరుగుతాయి. సమ్మర్ లో మజ్జిగను తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.

అయితే మజ్జిగను ఎక్కువగా తీసుకునే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మజ్జిగ తాగేవాళు మజ్జిగలో ఉపును పరిమితంగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివే అయినా పరిమితంగా తీసుకుంటే మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.