గుమ్మడికాయలో విటమిన్ ఏ, సీ, ఈ పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణశయాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మరియు కంటిచూపును మెరుగుపరుస్తాయి. గుమ్మడికాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. గుమ్మడికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయి. విటమిన్ ఈ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుందని చెప్పవచ్చు. గుమ్మడికాయలో ఉండే మెగ్నీషియం ఎముకల బలాన్ని పెంచుతుంది. గుమ్మడికాయ గింజలు ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన గర్భధారణకు మద్దతు ఇస్తాయి.
గుమ్మడికాయలో రాగి, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ బీ1, బీ6 ఉంటాయి. బూడిద గుమ్మడికాయ కొవ్వు, కేలరీలను తగ్గించడంలో తోడ్పడుతుంది. బరువు తగ్గాలని భావించే వాళ్లకు బూడిద గుమ్మడికాయ మేలు చేస్తుందని చెప్పవచ్చు. గుమ్మడికాయ జ్యూస్ లో లిపిడ్ తగ్గించే లక్షణాలు, డైటరీ ఫైబర్ లో ఉండే అధిక కంటెంట్ సీరం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
ఖాళీ కడుపుతో గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వల్ల సెప్టిక్ అల్సర్ కు చెక్ పెట్టవచ్చు. గుమ్మడికాయ రసం తాగిన తర్వాత 3 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండాలి. గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల వృద్ధాప్యాన్ని పెంచే ఫ్రీ రాడికల్స్ తో పోరాడవచ్చు. కిడ్నిలోని రాళ్లకు చెక్ పెట్టడంలో ఇది సహాయపడుతుంది.