మీ ఇంట్లో కొత్తిమీర త్వరగా వాడిపోతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఎన్నో లాభాలు!

కొత్తిమీరను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి, ముందుగా కడిగి ఆరబెట్టి, టిష్యూ పేపర్‌తో చుట్టి, జిప్ లాక్ ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. వంటకాలకు ప్రత్యేకమైన రుచిని అందించడంలో కొత్తిమీర ఉపయోగపడుతుందనే సంగతి తెలిసిందే. వంటింట్లో కొత్తిమీర త్వరగా వాడిపోవడం వల్ల ఎక్కువమంది ఇబ్బందులు పడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే.

చిన్న ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు పోసి కొత్తిమీరను పెడితే మంచిది. ఈ విధంగా చేయడం వల్ల కొత్తిమీర తాజాగా ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. కొన్ని వారాల పాటు కొత్తిమీర ఫ్రెష్ గా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. చిన్న ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లపోసి అందులో కొత్తిమీర పెట్టి దానిని పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం వల్ల అవి తాజాగా ఉంటాయని చెప్పవచ్చు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ చిట్కా బాగుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఈమె తెలివి మామూలుగా లేదుగా అని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్లాస్టిక్ డబ్బాకు బదులుగా గాజు డబ్బాను వాడితే మంచిది అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోకు ఏకంగా 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ వీడియో ఏ స్థాయిలో ఆకట్టుకుందో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. కూరగాయలు తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే అని చెప్పడంలొ సందేహం అకక్ర్లేదు.