Pawan Kalyan: జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయాలపై కాస్త ఆసక్తి తగ్గిందని తెలుస్తోంది. ఈయన అధికారం వచ్చిన మొదట్లో చూపినంత ఉత్సాహం ఇటీవల కాలంలో చూపించలేదు. ముఖ్యంగా ప్రభుత్వ సమావేశాలు సమీక్షలు వంటి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో ఈ విధమైనటువంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొనకపోవడంపై కూడా హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ ఆరోగ్యం బాగా లేక సమావేశానికి హాజరు కాలేదని తొలి రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇకపోతే పిఠాపురం నియోజకవర్గం విషయంలో రివ్యూ వ్యవహరించడం చూస్తుంటే కావాలని హాజరు కాలేదా? లేక నిజంగానే ఆరోగ్యం బాగాలేక హాజరు కాలేదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మూడో సారి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం రెండు రోజుల పాట జరుగుతాయి. ఇలా కలెక్టర్ల కాన్ఫరెన్స్ తో పాటు క్యాబినెట్ మీటింగ్ కూడా నెలకు రెండు సార్లు జరుగుతుంది. అయితే ఇలాంటి సమావేశాలలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెప్పాలి.
ఇలా పవన్ కళ్యాణ్ ఇలాంటి కలెక్టర్ల సమావేశానికి క్యాబినెట్ మీటింగ్ కు హాజరు కాకపోవడం పై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి.పవన్ కల్యాణ్ నిత్యం సమీక్షలతో అధికారులతో సమావేశాలు నిర్వహించడం కంటే క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైన, పాలనపైనా పవన్ దృష్టిపెట్టాలని కోరుకుంటున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఫోన్ కి కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని వార్తలు వినిపించాయి.
పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా ఉన్నవారు పవన్ కళ్యాణ్ మైండ్ లో ఏదో తిరుగుతుందని కానీ ఆ విషయాన్ని బయట పెట్టడం లేదని చెబుతున్నారు.తామంతా కలిసే ఉన్నామని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదిహేనేళ్ల పాటు కొనసాగాలని కూడా కోరుకున్నారు. కానీ సమీక్షలు, మంత్రివర్గ సమావేశాలు, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లకు ఎందుకు హాజరు కావడం లేదంటే అసలు పవన్ ఉద్దేశం ఏంటో ఊహాతీతం అనే చెప్పాలి.