Pawan Kalyan: ఇటీవల పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈయన మరణం పై ఎంతో మంది పాస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈయన మరణం కాస్త రాజకీయాల పరంగా సంచలనాలను సృష్టిస్తుంది. ఇక ప్రవీణ్ మరణం పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.
ఇక తాజాగా ప్రవీణ్ మరణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణం అంటూ పాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ పెద్ద ఎత్తున స్పీచ్ లు ఇస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ మాట్లాడటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పాల్ తెలిపారు.
జనాలను రెచ్చగొట్టేలా మత ప్రసంగాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా జనసేన కార్యకర్తలు మాత్రం పాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈయనది సహజ మరణం కాదని ఈయన మరణం వెనుక ఏదో కుట్ర కూడా ఉందని పెద్ద ఎత్తున సందేహాలు కలుగుతున్నాయి .
సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున ఆధారాలు కూడా దొరకడంతో ఇది కచ్చితంగా హత్య అని తెలుస్తుంది. ఇక ఈ మరణం పై మహాసేన రాజేష్ కూడా స్పందించారు. పోలీసులు ఎప్పటికప్పుడూ వివరాలు చెప్పకుండా తాత్సారం చేయడంతో అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వారికి శత్రువులు ఉంటారనన్నారు. అలాంటి లక్షణం ఉన్న ప్రవీణ్ పగడాలను ఎవరైనా చంపేసి ఉంటారని మహాసేన రాజేష్ సైతం పలు అనుమానాలను వ్యక్తం చేశారు.