Soundarya: నువ్వు వెళ్లాల్సిన సమయం వచ్చింది… సౌందర్యను హెచ్చరించిన నిర్మాత !

Soundarya: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగినటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు. ఈమె ఇండస్ట్రీలో కేవలం 10 సంవత్సరాలు పాటు మాత్రమే కొనసాగారు అయితే ఈ పది సంవత్సరాల కాలంలో వివిధ భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన సక్సెస్ అందుకున్నారు. ఇలా సినీ ఇండస్ట్రీలో అగ్రతారలుగా ఓ వెలుగు వెలిగిన సౌందర్య ఊహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా సౌందర్యం మరణించి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఈమె మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే సౌందర్య మరణం తన తండ్రి సత్యనారాయణ ముందే ఊహించారని పలు సందర్భాలలో వార్తలు వినిపించాయి ఆయన తన కూతురి జాతకం గురించి చెబుతూ తన కూతురు సినిమా ఇండస్ట్రీలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతుందని చెప్పారు కానీ పదేళ్ల తర్వాత తనకు ప్రమాదం పొంచి ఉందని నిర్మాత చిట్టిబాబు వద్ద సౌందర్య తండ్రి సత్యనారాయణ చెప్పినట్లు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.

ఇలా సౌందర్య సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది పెళ్లి కూడా జరిగింది అయితే తన తండ్రి చెప్పినవన్నీ కూడా ఆమె జాతకంలో నిజమయ్యాయి అందుకే తన ప్రమాదం నుంచి బయటపడాలి అంటే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే మంచిదని నేను ఒకరోజు తన దగ్గరకు వెళ్లి ఇదే విషయం చెప్పాను. మీ తండ్రి చెప్పినవన్నీ కూడా నిజమయ్యాయి ఇక నువ్వు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండు అంటూ చెప్పాను.

నేనిలా మాట్లాడటంతో సౌందర్యం అదేంటి సార్ అలా అన్నారు నాన్న చెప్పినవన్నీ నిజమయ్యాయి కానీ ఇది నిజం కాదని నేను నిరూపిస్తాను. చివరి వరకు సినిమాలలోనే కొనసాగుతాను అంటూ సౌందర్య నాతో చెప్పారు. అయితే ఇలా చాలెంజ్ చేసిన కొద్ది రోజులకే ఆమె మరణించడం జరిగిందని చిట్టిబాబు సౌందర్య గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.