మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో నోట్లు కాలడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అయితే కాలిన నోట్లను బ్యాంకులో తీసుకుంటారా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. సగం కాలిన నోట్ల కట్టలను బ్యాంకులో ఇస్తే మనకి తిరిగి క్యాష్ ఇస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. చిరిగిన లేదా పాత నోట్లను తిరిగి తీసుకొని కొత్త నోట్లను బ్యాంకులు ఇస్తాయి.
ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేట్ బ్యాంకైనా నోటు స్పష్టంగా గుర్తించదగిన స్థితిలో ఉంటే మాత్రమే వాటిని మార్చుకునే అవకాశం ఉంటుంది. నోటు పూర్తిగా కాలిపోయిన లేదా గుర్తించలేనంతగా పాడైపోతే వాటిని ఆర్బీఐ స్పెషల్ బ్రాంచ్ లలో మాత్రమే మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. నోటుపై రాజకీయ నినాదాలు లేదా అనుచిత పదాలు రాసి ఉంటే అలాంటి నోట్లు చెల్లుబాటు అయ్యే అవకాశాలు అయితే లేఉ.
ఒక నోటు సగానికి మించకుండా కాలిపోయి ఉంటే బ్యాంకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశాలు అయితే ఉంటాయి. నోటు తీవ్రంగా పాడైపోయినప్పుడు బ్యాంకు తనిఖీ చేసినా ఒక్కసారిగా మొత్తం క్యాష్ ఇచ్చే అవకాశాలు ఉండవు. ఉదాహరణకి రూ.500 నోటు చాలావరకు కాలిపోతే దానికి పూర్తి మొత్తం కాకుండా రూ.300 పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఒకవేళ బ్యాంక్ మార్పిడి చేసుకునేందుకు నిరాకరిస్తే ఆర్బీఐ స్పెషల్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు. crpc@rbi.org.in నంబర్ కు మెయిల్ చేయడం లేదా 14440 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.