స్కూల్ పిల్లాడు 46 లక్షలు దొంగతనం

పదిహేనేళ్ల పిల్లాడు స్నేహితుల కోసం చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది. 46 లక్షల రూపాయలు దొంగతనం చేసి స్నేహితులకు కానుకగా పంచేశాడు. ఆ వయసు పిల్లలు స్నేహితుల దినోత్సవం రోజు ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పటం, ఫ్రెండ్ షిప్ బ్యాండులు కట్టడం, కానుకలు ఇవ్వటం చేస్తుంటారు. లేదా ఏ పిక్నిక్ కి వెళ్ళటమో, చిన్న పార్టీ చేసుకోవటమో చేస్తుంటారు. కానీ మధ్య ప్రదేశ్ కి చెందిన పదో తరగతి చదువుతున్న బాలుడు వీటన్నిటికీ భిన్నంగా చేశాడు.

అక్షరాలా 46 లక్షల రూపాయలు దొంగతనం చేసి తన స్నేహితులందరికీ పంచేశాడు. ఆ బాలుడి తండ్రి ఒక బిల్డర్. ఒక ఇల్లు అమ్మగా ఆయనకి 60 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బును తెచ్చి తన ఇంట్లోని బీరువాలో దాచాడు. ఒకరోజు డబ్బుల కోసం బీరువా తెరచి చూడగా డబ్బు తక్కువ ఉన్నట్టు అనిపించింది. ఆ డబ్బుని లెక్కించి చూడగా అందులో 14 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 46 లక్షలు కనిపించకపోవటంతో దొంగతనం జరిగిందేమో అని అనుమానం వచ్చింది అతనికి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతున్న పోలీసులకు బాలుడిపైన అనుమానం వచ్చింది. ఆ బాలుడిని ఆరా తీయగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. ఆ డబ్బును దొంగిలించి ఫ్రెండ్ షిప్ డే రోజు తన ఫ్రెండ్స్ అందరికి పంచి పెట్టినట్టు తెలిపాడు. అతను చెప్పింది విని పోలీసులు, అతని తండ్రి షాక్ అయ్యారు.