భర్త వేదింపులు భరించలేక గొడ్డలితో నరికి గుండెను కోసిన 5 వ భార్య..!

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతుందని. అంతేకాకుండా అక్రమ సంబంధాల వల్ల కూడా భార్యాభర్తల బంధం దెబ్బతింటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మొదలైన చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారి హత్యలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో భర్త పెట్టే వేధింపులు భరించలేక భార్య గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలిలో నివసిస్తున్న బీరేందర్ గుర్జార్‌ ఐదుగురు భార్యలు. మొదటి నలుగురు భార్యలు అతని వేదింపులకు భరించలేక అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాంచన గుర్జర్ అనే మహిళను 5 వ వివాహాం చేసుకున్నాడు. ఆమెను వివహం చేసుకున్న తర్వాత కూడా బీరేందర్ తన వేదింపులకు కొనసాగించాడు. డ్రగ్స్ బానిస అయిన బీరేందర్ రోజూ తాగి వచ్చి కాంచనని కొట్టేవాడు. ఇలా ప్రతిరోజు తాగి చిత్రహింసలతో గురి చేయటంతో కాంచన వేధింపులు భరించలేక విసిగిపోయింది. ఎలాగైనా తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన కాంచన అతనిని హత్య చేయాలని నిర్ణయించుతుంది.

ఈ క్రమంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్తకి భోజనంలో నిద్ర మాత్రలు కలిపి పెట్టింది. అది తిన్న వీరేందర్ నిద్ర మత్తులోకి జారిపోయాడు. ఆ తర్వాత కాంచన తన భర్త మీద గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా దేహాన్ని బట్టలలో చుట్టి నిర్మానుష ప్రదేశంలో పడేసింది. హత్యకు గురైన భర్తకు సంబంధించిన బట్టలు కాల్చివేసింది. బీరేందర్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అది బీరేందర్ మృతదేహంగ గుర్తించిన పోలీసులు కాంచన మీద అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పెట్టింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.