పది అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పది అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థలో ఉద్యోగం వస్తే నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని మలంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్టులో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పదో తరగతి పాసై ఐటీఐ కూడా పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రూల్స్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 184 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. 2023 సంవత్సరం ఆగష్టు 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

పది, ఐటీఐ మార్కుల వెయిటేజీ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. hindustancopper.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.