శివరాత్రికి మాత్రమే తెరిచే దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది శివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున శివరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారు శివరాత్రి పండుగ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి శివాలయాలలో శివయ్య దర్శనం కోసం భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇలా మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా శివాలయాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఇదిలా ఉండగా మన దేశంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి అయితే కొన్నింటికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.

మధ్యప్రదేశ్ భూపాల్ కు 48 కిలో మీటర్ల దూరంలో ఉంది. 1000 అడుగుల ఎత్తైన కొండపై ఓ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సోమేశ్వరాలయంగాపిలుస్తారు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు అది కూడా శివరాత్రి పండుగను పురస్కరించుకొని మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు.ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఈ క్రమంలోని ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి సాధారణ భక్తులకు దర్శనం కల్పిస్తారు.

శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటలకు ఆలయం తెరిచిన అనంతరం సాయంత్రం 6 గంటలకు మోసవేస్తారు. ఇలా ఏడాదికి 12 గంటలు మాత్రమే ఈ ఆలయం తెరచి ఉంటుంది. ఈ విధంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తుల తరలి వస్తుంటారు. ఇక శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.