గడియారం ముడుపుగా కడితే కోరికలు తీర్చే దేవుడు..ఎక్కడంటే..?

సాధారణంగా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద భారం వేసి కోరికలు తీర్చమని దేవుడిని వేడుకుంటూ ఉంటారు . అలాగే గోరిన కోరికలు తీరితే మొక్కులు చెల్లించుకొని ముడుపులు కడతామని దేవుళ్ళని వేడుకుంటారు. ఇలా కొంతమంది భక్తులు కొబ్బరికాయలను తీసుకెళ్లి ముడుపు కడుతుంటారు. మరి కొంతమంది దేవుళ్ళ దగ్గర తమ తమ కోరికలు వేడుకుని అవి నెరవేరితే ముడుపులు చెల్లిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణం. అయితే మధ్యప్రదేశ్ లోని ఒక మందిరం దగ్గర ఏకంగా గోడ గడియారాలను ముడుపుగా చెల్లిస్తుంటారు. దీని గురించి ఇతర వివరాలు తెలుసుకుందాం…

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలోని అన్హెల్ రోడ్ పక్కన సాగస్ మహారాజ్ గది వాలే బాబా ఆలయం ఉంది. కోరిన కోరికలు తీర్చే దైవంగా ఇక్కడ ఈ ఆలయం చాలా ప్రసిద్ధి. స్థానికులు నిత్యం పూజలు చేస్తూ ఈ బాబా ని కొలుస్తుంటారు. ఆ ఆలయం ఎదురుగా పెద్ద మర్రి చెట్టు ఉంది. అక్కడి స్థానికులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాబా దగ్గరకు వెళ్లి వారి కోరికలు తీరితే ముడుపు కడతామని ప్రార్థిస్తారు. అలాగే వారి కోరికలు తీరిన వెంటనే ఈ చెట్టు కొమ్మలకు గడియారాలు కడుతూ ముదుపుగా కడతారు.

ఇప్పటికే ఈ చెట్టుకి దాదాపుగా 2000 గోడ గడియారాలు మూడుపుగా కట్టారు. గతంలో ఒక భక్తుడు తన కోరిక నెరవేరితే తమ ఇంట్లో ఉన్న అత్యంత విలువైన గోడగడియారాన్ని ముడుపుగా చెల్లిస్తాను అని ముక్కుకున్నాడంట. ఆయన కోరిక నెరవేరడంతో ఖరీదైన గోడగడియారాన్ని తెచ్చి మందిరం ముందు ఉన్న మరి చెట్టుకి కట్టాడు. అప్పటినుండి భక్తులు తమ కోరికలు నెరవేరితే ఇలా గోడగడియారాలను ముడుపుగా చెల్లించడం ఆనవాయితీగా మారింది. వినడానికి దూరంగా ఉన్నా ఇది నిజం… ఎవరి నమ్మకం వారిది.