వైరల్ : తన దగ్గరకి పవన్ ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చిన ఆలీ.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే కమెడియన్ ఆలీ ల మధ్య స్నేహం కోసం కానీ తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. మరి ఆలీ అయితే రాజకీయం గా పవన్ ని కాదని ఉండడం చాలా వరకు పవన్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. పైపెచ్చు పవన్ కూడా ఆలీని దూరంగా ఉంచడం అనేది ఆసక్తిగా మారింది.

ఇది కొన్నాళ్ల నుంచి సాగుతూ ఉండగా నెక్స్ట్ కూడా ఇద్దరూ పెద్దగా కలిసింది కూడా కనిపించలేదు. అయితే ఇటీవల ఆలీ కూతురికి పెళ్లిని తాను ఘనంగా హైదరాబాద్ లో జరిపించాడు. అయితే ఈ వేడుకకి అనేక మంది సినీ ప్రముఖులు హాజరు కాగా పవన్ కనిపించకపోవడం అనేది ఆసక్తిగా మారింది.

అయితే దీనిపై చాలా మంది పవన్ కావాలనే వెళ్ళలేదు అని అనుకున్నారు కానీ లేటెస్ట్ గా అయితే ఆలీ అసలు ఆహ్వానం ఎందుకు రాలేదో అనేది వెల్లడి చేసాడు. మరి పవన్ కి అయితే తాను కార్డు పంపించానని పెళ్ళికి రావాలని కూడా కోరానని కానీ..

పవన్ ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల రావడం కుదరలేదని లేకపోతె వచ్చి ఉండేవారని తెలిపాడు. అంతే కాకుండా మరోసారి తప్పకుండ తమ కుటుంబాన్ని పిల్లలని కలిసి ఆశీర్వదిస్తానని కూడా పవన్ చెప్పాడని ఆలీ వెల్లడి చేసిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.