Actor Sivaji: పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ గా శివాజీ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పై రెండవ ప్రాజెక్టుగా సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వంలో వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ నటుడు శివాజీ, లయ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్ తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు. 90’s వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ గా కనిపించనున్న శివాజీ ఎంతో నిజాయితీపరుడైన వ్యక్తి. తప్పుని సమర్ధించని మనస్తత్వం, అన్యాయాన్ని సహించలేని క్యారెక్టర్. తన వల్ల మాత్రమే కాదు, ఏ ఒక్కరి వల్ల కూడా జనం ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే మనిషి. భార్య బిడ్డలే ఇతని ప్రపంచం. వాళ్ళని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. వాళ్ళ దాకా వస్తే ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడని మనిషి.

దీపావళి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుండి పోస్టర్ విడుదలైంది. ఆ పాస్టర్ చూస్తుంటే గ్రామీణ వాతావరణంలో శ్రీరామ్ తన కుటుంబంతో కలిసి దీపావళి పండుగ చేసుకునేందుకుగాను దీపావళి పటాసులు తీసుకుని వెళుతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ చిత్ర టైటిల్, చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలు చిత్ర బృందం వెల్లడించాల్సి ఉంది.

నటీనటులు : శివాజీ, లయ , అలీ ధనరాజ్ , ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు , కరణ్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : శ్రీ శివాజీ ప్రొడక్షన్స్
నిర్మాత : శివాజీ సొంటినేని
రచన – దర్శకత్వం : సుధీర్ శ్రీరామ్
సంగీత దర్శకుడు : రంజిన్ రాజ్
ఎడిటర్ : బాలు మనోజ్.డి
కెమెరామెన్ : రిత్విక్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ : ప్రసాద్ లింగం, ధీరజ్.పి
కో డైరెక్టర్ : గుడివాక శివ కుమార్
ప్రొడక్షన్ కంట్రోలర్ : బాలాజీ శ్రీను కరెడ్ల
పీఆర్వో : వంశీ-శేఖర్

KS Prasad Full Analysis On Modi AP Tour | Chandrababu | Telugu Rajyam