Comedian Ali: అందరి ముందు ఆలీపై చేయి చేసుకున్న ప్రొడ్యూసర్… మరీ ఇంత దారుణమా?

Comedian Ali: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అలీ ఒకరు. ఈయన బాలనటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ మంచి అవకాశాలను అందుకున్నారు. ఇలా బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించిన అలీ అనంతరం పెద్దయిన తర్వాత కూడా కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆలీ వరుస సినిమాలలో చేస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగిన అలీపై ఏకంగా ఓ నిర్మాత చేయి చేసుకున్న విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో అలీ బయట పెట్టారు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సమయంలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మురళీమోహన్ హీరోగా నిప్పులాంటి నిజం అనే సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపారు. అప్పట్లో తెలుగు సినిమాలు చెన్నైలో షూటింగ్ జరిగేవి. ఇలా ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది నేను షూటింగ్ కి వెళ్ళాలి కానీ అదే రోజే ఆంధ్రాలో పెద్ద ఎత్తున తుఫానులు రావడం అలాగే తన మూడవ చెల్లి కూడా మరణించడంతో ఆరోజు షూటింగ్కు వెళ్లలేని పరిస్థితిలో ఆలీ ఉన్నారట.

మరుసటి రోజు షూటింగ్ కి వెళ్ళగా నిర్మాత తనని పిలిచి ఎందుకురా నిన్న షూటింగ్ కి రాలేదు అంటూ నన్ను కొట్టారని, ఆ క్షణం ఎంతో బాధనిపించి పక్కకెళ్ళి బాధపడుతూ కూర్చున్నానని ఆలీ గుర్తు చేసుకున్నారు. అదే సమయంలోనే రాఘవేంద్ర రావు గారు వచ్చి ఏరా ఏమైంది అలా కూర్చున్నావు అంటూ నన్ను అడిగారు. ఇలా నిర్మాత కొట్టారని చెప్పాను. వెంటనే నిర్మాతను పిలిచి అసలు ఎందుకు కొట్టావు వాడిని అని ప్రశ్నించగానే నిన్న షూటింగ్ కి రాలేదు అందుకే కొట్టానని చెప్పారు. షూటింగ్ కి రాకపోతే కొడతావా? అసలే పరిస్థితులలో రాలేదో నీకు తెలుసా నిన్న వాళ్ళ చెల్లెలు చనిపోయింది ఆ విషయం తెలుసా నీకు? నిజా నిజాలు తెలియకుండా ఇలా చేయి చేసుకోవడం మంచిది కాదు అంటు నిర్మాతను తిట్టడమే కాకుండా ఆరోజు షూటింగ్ కూడా క్యాన్సిల్ చేశారని అలీ అప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకన్నారు.