ట్విట్టర్ రివ్యూ : షారుఖ్ “పఠాన్” తో హిట్టు కొట్టాడా.?

ఈరోజు బాలీవుడ్ ఆడియెన్స్ కి గాను ఈరోజు వచ్చింది మాత్రం ఓ బిగ్ డే అని చెప్పాలి. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బాలీవుడ్ కం బ్యాక్ అందులోని హీరో షారుఖ్ ఖాన్ తాలూకా బాక్సాఫీస్ కం బ్యాక్ కూడా తన లేటెస్ట్ సినిమా “పఠాన్” తోనే ఉంటుందా లేదా అనేది అత్యంత ఆసక్తిగా మారింది.

అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ భారీ చిత్రం  వచ్చింది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ అనుకున్న కం బ్యాక్ వచ్చిందా లేదా లేక మళ్ళీ షారుఖ్ బోల్తా పడ్డాడా అనేది ఈరోజు ఫస్ట్ షో పూర్తయ్యే నాటికీ తెలిసింది. ఇక ఈరోజు సినిమా చూసిన ఆడియెన్స్ అయితే ట్విట్టర్ లో తమ రివ్యూస్ అందిస్తున్నారు.

ఇక ఆల్ మోస్ట్ గా చూసినట్టు అయితే ఈ సినిమా కి మంచి పాజిటివ్ టాక్ ఎక్కువ వినపడుతుంది. బాలీవుడ్ నుంచి ప్రముఖ సినీ విమర్శకుడు తరన్ ఆదర్శ్ ఏకంగా 3 కి పైగా రేటింగ్ ఇచ్చేసారు. దీనితో ఆల్రెడీ హిట్ టాక్ స్టార్ట్ అయ్యింది. మరి సినిమాలో స్టోరీ టెల్లింగ్ కానీ యాక్షన్ బ్లాక్ లు గాని అదిరే లెవెల్లో ఉన్నాయని అంటున్నారు.

కాకపోతే సినిమాలో కాస్త గ్రాఫిక్స్ వీక్ ఉన్నాయని వినిపిస్తుంది కానీ మొత్తంగా అయితే షారుక్ అండ్ టీం అదరగొట్టారనే అంటున్నారు. ఇది హిందీ జనం టాక్ టాక్ తెలుగు నుంచి కూడా సినిమాపై మంచి రెస్పాన్స్ వినిపిస్తుంది. అంతే కాకుండా షారుఖ్ కం బ్యాక్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి బాయ్ కాట్ లు కూడా ఏమి చెయ్యలేవు అని అంటున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు పఠాన్ ఫలితం బాలీవుడ్ లో ఓ సంబరంగా స్టార్ట్ అయ్యింది. సో కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు.