వైరల్ : 68లో కూడా గ్రేస్ ని జ్యూస్ లా చేసుకొని తాగేసిన మెగాస్టార్ 

అసలు టాలీవుడ్ సినిమా దగ్గర మెగాస్టార్ అనే పర్శనాలిటీ కి ఉన్న అధ్యాయమే వేరు అని చెప్పాలి. మెగాస్టార్ కి ఇంతపాటి ఎనలేని క్రేజ్ రావడానికి కారణం తన మాస్ తో పాటుగా తన డాన్స్ కూడా అని చెప్పాలి. అయితే డాన్స్ ఏముంది అందరూ చేస్తారు అనుకోవచ్చు. కానీ చిరంజీవిలో ఉన్న ఆ మ్యాజిక్ ఏదన్నా ఉంది అంటే తన గ్రేస్ అని చెప్పాలి.

డాన్స్ తో పాటుగా చిరు కనబరిచే గ్రేస్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు చిరు అంత ఏజ్ లో కూడా ఇప్పుడు చేస్తున్న డాన్స్ లు చూసి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రీసెంట్ గా వచ్చిన చిత్రం భోళా శంకర్ లో కూడా చిరు ఆశ్చర్యపరచగా లేటెస్ట్ గా అయితే మరో వీడియో ఒకటి వైరల్ గా మారింది.

రీసెంట్ గా మెగా ఇంట వరుణ్ తేజ్ పెళ్లి జరగ్గా ఈ పెళ్లి సంగీత్ లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన “జవాన్”లో ర్యాప్ సాంగ్ పాడిన రాజకుమారి అక్కడ కూడా జవాన్ సాంగ్ ని లైవ్ పెర్ఫామెన్స్ చేయగా అందులో మెగాస్టార్ చిరంజీవి చేసిన స్టెప్పులు చూసి అంతా షాకవుతున్నారు.

మెయిన్ గా ఈ 68 ఏళ్ల వయసులో తన గ్రేస్ మూమెంట్స్ చూస్తే బాస్ గ్రేస్ ని చూస్తే ఈ ఏజ్ లో కూడా అసలు ఎలా సాధ్యం అంటూ అంతా అవాక్కవుతున్నారు. దీనితో మెగా ఫ్యాన్స్ లో ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. కాగా నెక్స్ట్ మెగాస్టార్ అయితే “విశ్వంభర” అనే భారీ చిత్రంలో తాను నటించనున్నారు. ఈ చిత్రాన్ని “బింబిసార” ఫేమ్ దర్శకుడు వసిష్ఠ తెరకెక్కించనున్నాడు. 
https://x.com/rajeshmanne1/status/1724435313055899757?s=20