RRR ని వేటాడుతున్న “జవాన్”

ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర అసలు 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాని ఓపెన్ చేసిందే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఒకరైన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కాగా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రం “పఠాన్” తర్వాత మళ్ళీ ఇదే ఏడాదిలో రిలీజ్ చేసిన ఇంకో 1000 కోట్ల గ్రాసింగ్ చిత్రమే “జవాన్”.

మరి దీనిని యంగ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంతో తాను కూడా మొట్టమొదటి సారిగా తమిళ్ నుంచి అయితే 1000 కోట్లు కొట్టిన దర్శకునిగా నిలిచాడు. మరి ఇలా థియేటర్స్ లో ఎన్నో భారీ రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ షారుఖ్ రికార్డులు తానే బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ సెట్ చేసాడు.

మరి థియేటర్స్ లో అయ్యిన తర్వాత ఈ సినిమా రీసెంట్ గానే నవంబర్ 2న షారుఖ్ ఖాన్ బర్త్ డే కానుకగా ఐతే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఇందులో కూడా హిందీ తమిళ్ మరియు తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. కాకపోతే కాస్త లెంగ్త్ పెంచి రిలీజ్ చేయగా ఈ సినిమాని ఓటిటి లో కళ్ళు చెదిరే రెస్పాన్స్ వచ్చేసింది.

మొదటి వీకెండ్ లోనే ఈ సినిమాకి ఏకంగా 14.9 మిలియన్ గంటలు వీక్షకులు ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో వాచ్ చేయగా ఇది ఇండియన్ సినిమా దగ్గర అయితే బాలీవుడ్ సినిమాకి కూడా రాని రెస్పాన్స్ అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఇది జస్ట్ వీకెండ్ కె ఆల్ మోస్ట్ 15 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి.

అయితే మొదటి వారానికి అయితే నెట్ ఫ్లిక్స్ లో మన తెలుగు చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) 18 మిలియన్ గంటలకి పైగా ఉంది. దీనితో జవాన్ జస్ట్ వెనుక ఉంది అని చెప్పాలి, మరి దీనిని కూడా క్రాస్ చేస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ రికార్డు నమోదు అవుతుంది అని చెప్పక తప్పదు.