ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలిసిందే. ఇక ఈ లిస్ట్ లో అయితే తెలుగు సినిమా నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీగా నిలిచింది. అయితే ముందు నుంచి బాలీవుడ్ సినిమా ఉన్నప్పటికీ దానిని తెలుగు సినిమా బీట్ చేసింది. దీనికి తోడు బాలీవుడ్ సినిమాలో ఒక క్రైసిస్ లోకి కూడా వెళ్లడం వారికి మరింత దారుణంగా మారింది.
కానీ ఫైనల్ గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ పుంజుకొని ఈ 2023 లో మళ్ళీ తమ ఇండస్ట్రీని లేపుకుంది కానీ ఇక్కడ కూడా సౌత్ ఇండియా కి చెందిన దర్శకుల పాత్ర కూడా ఉంది. అయితే ఇక ఈ ఏడాదికి బిగ్గెస్ట్ ఎండింగ్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన చిత్రం “సలార్” రాబోతుండగా దీనికి తెలుగుతో పాటుగా హిందీలో కూడా మంచి హైప్ ఉంది.
కానీ ఇక్కడ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన “డన్కి” సినిమాతో ఉండగా హిందీలో షాకింగ్ గా సలార్ కి కూడా భారీ రిలీజ్ ఉంటుంది అనుకుంటే వారు సలార్ కి థియేటర్స్ ఇవ్వలేదు. దీనితో పూర్తిగా నిర్మాతలు తమ సినిమాని నేషనల్ చైన్స్ లో రిలీజ్ ఆపేసారు.
కానీ ఇక్కడ సలార్ కి ఇలా జరగడానికి కారణం అదే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కారణం అని కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్ల కితమే ప్రభాస్ అంటే షారుఖ్ ఖాన్ మోహంలో మారిన ఎక్స్ ప్రెషన్స్ వైరల్ అయ్యాయి. దీనితో ప్రభాస్ అంటే ఎందుకో షారుఖ్ ఖాన్ చాలా ఇన్ సెక్యూర్ గా ఉన్నాడని చాలా మంది అనుకున్నారు.
కానీ ఇపుడు మళ్ళీ ఈ రిలీజ్ వెనుక ఉంది కూడా షారుక్ అని నిన్న కూడా హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ పార్టీ ఇచ్చాడని అందుకే డీల్ తోనే సలార్ సినిమాని తొక్కాలని చూస్తున్నారని కొన్ని షాకింగ్ రూమర్స్ ఇప్పుడు ఈ క్లాష్ విషయంలో వినిపిస్తున్నాయి. మరి ఇది నిజంగా నిజమేనా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.