సెన్సేషనల్ సిరీస్ “ధూమ్ 4” పై బిగ్ అప్డేట్.!

ఇండియన్ సినిమా దగ్గర ఫ్రాంచైజ్ సినిమాలు బాగా పాపులర్ అయ్యింది బాహుబలి సిరీస్ తోనే అయినప్పటికీ అప్పటికే ఎన్నో బాలీవుడ్ సినిమాలో కూడా పలు చిత్రాలు సీక్వెల్స్ ఉన్నాయి. మరి అలా సెన్సేషనల్ హిట్ అయ్యిన సిరీస్ లో “ధూమ్” సిరీస్ కూడా ఒకటి.

మన ఇండియా సినిమా నుంచి ఒక స్టైలిష్ అండ్ హాలీవుడ్ లెవెల్ ఏక్షన్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే అని చెప్పవచ్చు. కాగా ఇప్పటివరకు మొత్తం మూడు సినిమాలు ఉండగా వాటిలో ఒకో సినిమాలో ఓ స్టార్ హీరో అయితే యాంటి హీరోగా నటించగా మొదటి సినిమాలో జాన్ అబ్రహం, రెండో సినిమాలో హృతిక్ రోషన్ అలాగే మూడో సినిమాలో విలన్ గా అమీర్ ఖాన్ లు నటించారు.

దీనితో ఈ సినిమాలు స్కేల్ అమాంతం పెరుగుతూ వస్తుండగా ధూమ్ 4 సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన గత చిత్రాలు భారీ  హిట్స్ అయ్యాయి. ఇక నాలుగో సినిమాలో అయితే కొన్ని క్రేజీ రూమర్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

కాగా ఈ రూమర్స్ ప్రకారం ధూమ్ 4 సినిమాలో ఇపుడు వరుస హిట్స్ తో బాలీవుడ్ ని ఏలుతున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఐతే యాంటీ హీరో పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. కాగా షారుఖ్ కి ధూమ్ 4 స్క్రిప్ట్ బాగా నచ్చింది అందుకే అందుకే ఈ సినిమా కూడా తాను చేస్తాడని పలు ఊహాగానాలు వైరల్ గా మారాయి.

మరి ఇహ క్రేజ్ ఉన్న ఈ సీక్వెల్ లో కానీ షారుఖ్ కనిపిస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రంలో షారుఖ్ కనిపిస్తాడా లేదో అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది అఫీషియల్ క్లారిటీ ఎపుడు వస్తుందో చూడాలి.