ఇప్పుడు “పుష్ప 2” లో ఈ ఇంట్రెస్టింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో భారీ హైప్ తో ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో గత 2021 లో వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రం పుష్ప కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 కూడా ఒకటి. బహుశా బాహుబలి మరియు కేజీఎఫ్ లాంటి సినిమాల తర్వాత దీనికే ఆ రేంజ్ హైప్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ చిత్రం అయితే గత కొన్నాళ్ల కితమే షూటింగ్ స్టార్ట్ చేసుకోగా రీసెంట్ గానే చిత్ర యూనిట్ వైజాగ్ లో కీలక షెడ్యూల్ నిమిత్తం వచ్చారు. ఇక అక్కడ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ కూడా దక్కగా ఇక్కడ అసలు ఏ సీన్స్ తెరకెక్కిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ బన్నీ క్యారెక్టర్ పుష్ప రాజ్ పై సన్నివేశాలు చేస్తున్నారు అట.

వైజాగ్ పోర్ట్ లో ఎర్రచందనం బిజినెస్ డీల్స్ కి సంబంధించి సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. అలాగే ఇందులో బన్నీ పై ఓ ఎలివేషన్ సీన్ ని కూడా చేస్తున్నారట. బహుశా సాంగ్ లో బిట్ అన్నట్టు కూడా బజ్ ఉంది. అయితే ఈ షెడ్యూల్ లో అయితే రష్మికా మందన్నా తో సీన్స్ ఏవి లేవట. ఇక ఈ సినిమాలో వీరితో పాటుగా సునీల్, అనసూయ అలాగే మరింతమంది బాలీవుడ్ స్టార్ నటులు కూడా కనిపించనున్నారు.