Pushpa: సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరరకెక్కిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి కోట్లల్లో కలెక్షన్స్ ని సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రతో పాటుగా రష్మిక అలాగే సునీల్,అనసూయ, ఫహద్ ఫాజిల్ వంటి పాత్రలు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఫహద్ ఫాజిల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించి ఫహద్ అదరగొట్టాడు. ఆ పాత్రకు అతనే పర్ఫెక్ట్ అనేలా నటించాడు. అయితే ఆ పాత్రకు మొదట మన టాలీవుడ్ హీరోని అనుకున్నారట. కానీ తర్వాత అది పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేయడంతో మార్కెట్ కోసం మలయాళం స్టార్ ఫహద్ వద్దకు వెళ్లారట. ఈ విషయాన్ని ఆ తెలుగు హీరో స్వయంగా చెప్పాడు. ఇంతకీ ఆ తెలుగు హీరో ఎవరో కాదు నారా రోహిత్. కాగా నారా రోహిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భైరవం.
ఈ సినిమా మీట్ లో నారా రోహిత్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో మొదట ఫహద్ ఫాజిల్ పాత్రకు నన్ను అడిగారు. అప్పుడు అది తెలుగు వరకే ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేసుకోవడంతో ఫహద్ గారిని తీసుకున్నారు అని తెలిపాడు. ఈ సందర్బంగా నారా రోహిత్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే నారా రోహిత్ విషయానికి వస్తే.. గతంలో వరుస సినిమాలు చేస్తూ బాణం, సోలో, రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి లాంటి మంచి విజయాలు అందుకున్న నారా రోహిత్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా మే 30 న రిలీజ్ కానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడుతూ నారా రోహిత్ ఈ విషయాన్ని తెలిపారు.