Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్ లో 16వ చిత్రం కావటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ సినిమాలో చరణ్ విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తుంది.
ఈ పోస్టర్లో రాంచరణ్ గుబురు గడ్డం పొడువాటి జుట్టుతో మాస్ లుక్ లో కనిపించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే పెరిగిపోయాయి. అయితే మరి కొంతమంది ఈ పోస్టర్ పై షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. అచ్చం ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో పుష్పరాజు గెటప్ లోనే కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఒకదాంట్లో అతడు అచ్చూ పుష్పలో అల్లు అర్జున్ లాగా.. మరోదాంట్లో కేజీఎఫ్ ఛాప్టర్ 1లో యశ్ లాగా కనిపిస్తున్నాడు. నాకు ఒక్కడికేనా మీకు కూడా అలాగే కనిపిస్తున్న అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్లపై కామెంట్లు చేసారు.
ఇక మరికొందరైతే బావ, బావమరిది సేమ్ సేమ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఓ అభిమాని అయితే పెద్ది, పుష్ప పోస్టర్లలోని రామ్ చరణ్, అల్లు అర్జున్ ముఖాలను సగంసగం చేసి పెట్టడం విశేషం. ఇందులో ఇద్దరూ దాదాపు ఒకేలా కనిపిస్తున్నారు. ఇలా బుచ్చిబాబు తన గురువు నుంచి పుష్ప లుక్ కాపీ కొడుతూ పెద్ది కోసం వాడుతున్నారు అంటూ దారునంగా కామెంట్లు చేస్తున్నారు.