Pushpa: సుకుమా డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్పరాజ్ అనే సంగతి మనకు తెలిసిందే. పుష్ప అంటే ఫ్లవర్ కాదు బ్రాండ్ అని నిరూపించారు. ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ సుకుమార్ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ అసలు పుష్ప కథకు మూలం ఏంటి..? పుష్పరాజ్ క్యారెక్టర్‌కు ఇన్‌స్పిరేషన్ ఎవరు? పుష్ప అనే టైటిల్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చిందనే విషయాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ ప్లాన్ చేసిన సుకుమార్, అందుకోసం చాలా రిసెర్చ్ చేశానని తెలిపారు.
ఈ డాక్యుమెంటరీ కోసం తిరుగుతున్న సమయంలో తాను పుష్పరాజ్ అనే ఒక వ్యక్తిని కలిసాను.అతన్ని అందరూ పుష్ప… పుష్ప అని పిలుస్తుండటంతో అల్లు అర్జున్‌తో అనుకున్న తరువాత అదే టైటిల్‌ను ఫిక్స్ చేశాను అంటూ ఈ సందర్భంగా సుకుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా పుష్పరాజు పాత్ర ఒక రియల్ క్యారెక్టర్ అనే విషయాన్ని సుకుమార్ వెల్లడించారు. ఇక పుష్ప3 గురించి ఈయనకు మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. పార్ట్ 3లో అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ, నాని కనిపిస్తారన్న ప్రచారం జరుగుతుంది.. నిజమేనా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సుకుమార్ సమాధానం చెబుతూ 2025 వ సంవత్సరంలో ఉన్న సుకుమార్ కు ఈ విషయం తెలియదు కానీ 2026లో స్క్రిప్ట్ రాసే సుకుమార్ కి అయితే కచ్చితంగా తెలుస్తుంది అంటూ తెలివిగా సమాధానం చెప్పారు.