Pushpa: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన కలిసి నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా రికార్డుల మోత మోగించడంతోపాటు, సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇకపోతే పుష్ప సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అలాగే శ్రీవల్లిగా రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఆ పాత్రలలో రష్మిక అల్లు అర్జున్ ని తప్ప మరెవరిని ఊహించుకోలేము అన్న విధంగా అద్భుతంగా నటించారు. వీరి నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా పాన్ ఇండియా హీరో హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ, రష్మిక. ముఖ్యంగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాక హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా, ఎందుకంటే ఈ పుష్ప జోడి ఇప్పుడు మరొకసారి రిపీట్ కానుంది.. అదేంటి పుష్ప 3 రాబోతోందా అని అనుకుంటున్నారా, కాదండోయ్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించాయి. ఇందులో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. అలాగే మరొక పాత్ర కోసం టాలీవుడ్ హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరొక హీరోయిన్గా రష్మిక మందనను సెలెక్ట్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఇదివరకు రష్మిక పేరుకు బదులుగా జాన్వి కపూర్ పేరు వినిపించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అనుహ్యంగా రష్మిక పేరు గట్టిగా వినిపిస్తోంది. చిత్రబృందం రష్మిక మందన్నతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే ఈ జోడీ మరోసారి తెరపై సందడి చేయడం ఖాయం. కాగా అల్లు అర్జున్, అట్లీ కలయికలో సినిమాపై రోజుకి ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. హాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర హీరోని ఇందులో ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
