ఆదిపురుష్’ పై ఆర్జీవీ సంచలన కామెంట్స్..! హిట్టా… ఫట్టా?

ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్న ‘ఆదిపురుష్’ టీజర్ పై మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే నెగటివ్ రియాక్షన్ లే ఎక్కువ ఉన్నాయి. అయితే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం దీనిపై తన అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘ఆదిపురుష్’ టీజర్ విజువల్స్ నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయన్నది వాస్తవం అని అన్నారు. అయితే చరిత్రలో జరిగిన కథ ఆధారంగా తరికెక్కిన సినిమా కాబట్టి దర్శకుడికి స్వాతంత్రం ఉంటుంది పైగా ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగులో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లతో వస్తున్న చిత్రం కాబట్టి అంచనాలు కూడా భారీగానే ఉంటాయి అని అన్నారు.

ఆ విషయంలో ఓం రౌత్ అభిమానులకు పెద్దగా ఆకట్టుకోకపోయినా తాను విన్నంతవరకు థియేటర్లో 3d ఎఫెక్ట్ తో చూసినప్పుడు ఈ చిత్రం కనువిందు చేస్తుందని తనకు తెలిసినట్లు చెప్పారు. అలాగే ఉదాహరణకు రాముడికి మీసాలు ఏంటి అని ప్రశ్నించిన వారికి దర్శకుడు వైపు నుంచి “రాముడికి మీసాలు ఎందుకు ఉండకూడదు?” అనే ప్రశ్నను సమాధానంగా చెప్పవచ్చు అని ఇవి అభిప్రాయ భేదాలు మాత్రమే అని పెద్దగా సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పారు.