Paritala Sunitha: సూట్ కేస్ సిద్ధం చేసుకుని రెడీగా ఉండు జగన్… మాస్ వార్నింగ్ ఇచ్చినా పరిటాల సునీత!

Paritala Sunitha: రాప్తాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత నేడు వైయస్సార్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నెల్లూరు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం గురించి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ సునీత జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి సునీత మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుని బావిలో దూకమంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు బావిలో దూకడం కాదు నువ్వు నీళ్ళులేని బావిలో దూకిన నువ్వు చేసిన పాపాలు మాత్రం పోవు అంటూ ఈమె జగన్ పై విమర్శలు కురిపించారు.సూట్ కేసు రెడీ చేసుకుని ఉండు… త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత. అదేవిధంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన భర్త పరిటాల రవి గారిని తలుచుకోనిదే నిద్ర పట్టదని కలలో కూడా మా ఆయన పేరే కలవరిస్తున్నారని తెలిపారు. పరిటాల రవి చనిపోయి 20 సంవత్సరాలు అవుతున్న పరిటాల రవి పేరు పలకనిదే ఏ సమావేశం కూడా మాట్లాడరని పరిటాల రవి పేరు చెబుతూ ఇక్కడ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కేసులకే భయపడి దాక్కుంటున్నారు. ఇలా నెలల తరబడి కనిపించకుండా పోయి తిరిగి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఫ్యాక్షను ఉసిగొలుపుతున్నారు అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా సునీత మండిపడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.