KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవునని తెలుస్తోంది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ అరెస్టు కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బి ఆర్ ఎస్ నేతలతో గంటల తరబడి సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటికి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాలేశ్వరం విషయంలో కొంతమంది బిఆర్ఎస్ నాయకులు అరెస్టు కావచ్చు అని కెసిఆర్ తెలిపారు అయితే ఎవరు కూడా అరెస్టులకు భయపడాల్సిన అవసరం లేదని ఈయన నేతలకు పిలుపునిచ్చారు.కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చిస్తున్నారు. ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అది కాలేశ్వరం కమిషన్ కాదని కాంగ్రెస్ కమిషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో మనం ముందుగానే ఊహించిందని ఈ విషయం గురించి ఎవరు ఆందోళన చేయాల్సిన పని లేదని తెలిపారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదు అని చెప్పినవాడు ఒక అజ్ఞాని అంటూ కేసిఆర్ విమర్శలు కురిపించారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగాలు ఏంటి అనేది ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఈయన నేతలకు సూచనలు చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ప్రాజెక్ట్ లో లోపాలకు ప్రధాన కారణమని రిపోర్ట్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయం ప్రకారమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణమంతా కొనసాగిందని కమిషన్ తన రిపోర్ట్ లో పేర్కింది.
