Jr.NTR: కుటుంబ వారసత్వం పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు… అలా బ్రతకడమే ఇష్టమంటూ?

Jr.NTR: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర రంగాలలో కూడా వారసత్వం కొనసాగుతూ ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఈ ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఈయన వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ బాలయ్య మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇక బాలకృష్ణ తర్వాత తదుపరి జనరేషన్ తో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి వారు మాత్రమే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ సినీ వారసత్వం గురించి మాట్లాడారు.

తనకు కుటుంబ వారసత్వం విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవని తెలియజేశారు. అలాగే తనకు భవిష్యత్తు గురించి ఆలోచించి బ్రతకడం ఇష్టం ఉండదని కేవలం వర్తమానంలో మాత్రమే బ్రతుకుతానని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అభిమానులు ప్రేక్షకులు నన్ను కేవలం నా సినిమాల ద్వారా మాత్రమే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటాను అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన తర్వాత తన కొడుకులు ఇండస్ట్రీకి హీరోలుగా వస్తారని అభిమానులు భావిస్తున్నారు కానీ ఈయన మాత్రం తన కొడుకులకు ఏది ఇష్టమో అటువైపే ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.