‎RGV: రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు.. రిటైర్డ్ మహిళా ఐపీఎస్ పిర్యాదుతో అలా!

‎RGV: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో మంచి మంచి సినిమాలు తెరకెక్కించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈయన సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారానే బాగా పాపులర్ అయ్యారు అని చెప్పాలి. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ.

‎మొన్నటి వరకు వ్యూహం సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగిన రాంగోపాల్ వర్మ దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అనుకునే నేపథ్యంలో మరో కేసులో ఇరుక్కున్నారు. తాజాగా ఆర్జీవీ పై మరో కేసు నమోదు అయ్యింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రిటైర్డ్ మహిళా ఐపీఎస్ రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు చేశారు. దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదూ చేశారు రిటైర్డ్ ఐపీఎస్. తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను దహనం అనే వెబ్ సిరీస్ లో వాడారని మహిళ రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు.

‎దహనం సినిమాకు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. దాంతో రామ్ గోపాల్ వర్మ పై కేస్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. రామ్ గోపాల్ వర్మ పై పోలీసులు IPC 509, 468, 469, 500, and 120(B). సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు పోలీసులు. ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దహనం అనే సిరీస్ ను తెరకెక్కించారు వర్మ. కమ్యూనిస్ట్‌ నేత రాములును ఎలా హత్య చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఒక కొడుకు కథగా ఈ వెబ్‌ సిరీస్‌ ను నిర్మించారు రామ్ గోపాల్ వర్మ. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించాము అని ఆర్జీవీ తెలిపారు. అయితే అందులో వాస్తవం లేదని సినిమాలో తప్పుగా చూపించారని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా తన పేరును వాడటం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ వ్యవహారం గురించి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.