బ్రహ్మాస్త్ర సినిమా ప్లాప్ అయినా కూడా లాభ పొందిన రాజమౌళి.. ఎలాగో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విడుదలైన భారీ సినిమా బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. హరి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తూ బొక్క బోర్లా పడింది. ఈ సినిమాలో అమితాబచ్చన్ నాగార్జున వంటి ప్రముఖులు కూడా నటించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకుని నష్టాలను మూట కట్టుకుంది. అయితే ఈ సినిమా ప్లాప్ అయినా కూడా రాజమౌళి మాత్రం ఈ సినిమా వల్ల లాభ పొందినట్లు తెలుస్తోంది.

బ్రహ్మాస్త్ర సినిమాని రాజమౌళి సౌత్ ఇండస్ట్రీలో సమర్పించాడు. అందువల్ల బ్రహ్మాస్త్ర నిర్మాతలు రాజమౌళికి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో రాజమౌళికి మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాని రాజమౌళితో ప్రమోట్ చేయించడం వల్ల సినిమాకి ఉపయోగపడుతుందని భావించిన నిర్మాతలు రాజమౌళికి రూ .10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళి కూడా తీసుకున్న డబ్బుకు బాగానే న్యాయం చేశాడు.

రాజమౌళి తన దర్శకత్వంలో వచ్చిన సినిమాల ప్రమోషన్స్ కి కూడా చేయని పనులు ఈ సినిమా కోసం చేశాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాల ప్రమోషన్స్ కి కూడా రాజమౌళి క్యాష్ షో కి వెళ్లలేదు. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి క్యాష్ స్టేజ్ మీద సందడి చేశాడు. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కోసం కష్టపడినందుకు రాజమౌళి
రూ .10 కోట్లు దక్కాయి. మొత్తానికి సినిమా ప్లాప్ అయ్యి నిర్మాతలు నష్టపోయినా కూడ రాజమౌళి మాత్రం బాగా లాభపొందాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.