Baahubali: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా కలిసి నటించిన సినిమా బాహుబలి. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించగా, రాణా విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో తమన్నా, అనుష్క రమ్యకృష్ణ సత్యరాజ్ వంటి చాలామంది నటీనటులు నటించి మెప్పించారు. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. కోట్ల బడ్జెట్లను సాధించి రికార్డుల మోత మోగించింది. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు ఇప్పటికి కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి అని చెప్పాలి.
అంత అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ రాజమౌళి. చూస్తుండగానే అప్పుడే ఈ సినిమా విడుదల ఈ పదేళ్లు పూర్తి చేసుకుంది. సినిమా పూర్తి పదేళ్లు అయిన సందర్భంగా మూవీ మేకర్స్ తాజాగా అందరూ ఒక చోట కలిశారు. బాహుబలి రీ యూనియన్ పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. బాహుబలి: ది బిగినింగ్ జూలై 10, 2015న విడుదలైంది. బాక్సాపీస్ వద్ద కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో బాహుబలి సినిమా 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి చిత్ర బృందం కదిలి వచ్చింది. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, నాసర్, సత్యరాజ్, రమ్య కృష్ణన్ తో పాటు ఈ చిత్రంలో నటించిన అనేక మంది ప్రముఖ నటులు, టెక్నీ షియన్లు ఈ రీయూనియన్ పార్టీలో సందడి చేశారు.
అలాగే ఈ విజువల్ వండర్ ను తీర్చిదిద్దిన అనేక మంది సాంకేతిక నిపుణులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కెమెరామెన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే బాహుబలి సినిమా కోసం రాత్రిపగళ్లు శ్రమించిన రాజమౌళి భార్య రమా రాజమౌళి, రాజమౌళి కోడలు శ్రీవల్లి ఈ వేడుకకు హాజరయ్యారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా తళుక్కుమన్నాడు. అందరూ ఉన్నారు కానీ హీరోయిన్ అనుష్క తమన్న లు మాత్రమే ఈ బాహుబలి సెలబ్రేషన్స్ కు హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

