‎SSMB29: మహేష్, జక్కన్న సినిమాలో అందరూ కొత్త వారేనా.. వైరల్ అవుతున్న సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కామెంట్స్!

SSMB29: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రారంభం కాక ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను కోట్ల బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‎ తరచూ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూళ్ళు పూర్తి అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వినిపించినా కూడా అధి క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌ కుమార్‌ చేసిన వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‎కాగా గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ సినిమాలకు సెంథిల్‌ సినిమాటోగ్రాఫర్‌ గా వర్క్ చేశారు. కానీ రాజమౌళి మహేష్ బాబు సినిమాకు మాత్రం తను వర్క్ చేయడం లేదని తెలిపారు. రాజమౌళి కూడా సెంథిల్‌ పనితీరును ప్రశంసిస్తూ పలు సందర్భాల్లో మాట్లాడారు. దీంతో SSMB29కి కూడా ఆయన వర్క్‌ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు అందరూ కొత్త వాళ్లకే అవకాశం ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్‌ కు సినిమాటోగ్రాఫర్‌ గా వర్క్‌ చేయడం లేదు అని తెలిపారు సెంథిల్.