SSMB29: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందు నుంచే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే మూడవ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు డైరెక్టర్ రాజమౌళి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా కోసం హీరో మహేష్ బాబు తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేశారు.
SSMB 29 అనే వర్కింగ్ టైటిల్స్ రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా మహేష్ బాబు అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ రాజమౌళి సినిమా నుంచి గ్లింప్స్ రానుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు పుట్టిన రోజు.. మహేష్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధం అవుతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేయడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బర్త్ డే రోజు రాజమౌళి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఎస్ఎస్ఎంబీ 29 సినిమా నుంచి గ్లింప్స్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
SSMB 29: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జక్కన్న మూవీ నుంచే ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
