Action: SSMB29లో దుమ్ముదులుపేలా యాక్షన్.. డేంజరస్ స్టంట్స్‌ చేస్తున్న మహేష్..?

టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన.. అనంతరం స్టార్ హీరోగా తన స్థానం నిలబెట్టుకున్నారు. వయసు పెరుగుతున్నా యంగ్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంటూ.. అభిమానులను అలరిస్తున్నారు.
ఇప్పుడు మహేష్ బాబు .. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు.

‘SSMB 29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇప్పటికే ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం షూటింగ్ జోరుగా జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీగా ఖర్చు చేస్తూ 1000 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చిస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. ఇక హీరోయిన్ విషయంలోనూ హైప్ ఏకంగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా పేరు వినిపిస్తోంది. అయితే ఇతర నటీనటుల వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ సినిమా నుంచి మెగా అప్డేట్స్ రావచ్చని తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ బజ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎప్పుడూ కొత్తగా ఆలోచించే రాజమౌళి, ఈసారి మహేష్ బాబుతో సరికొత్త రిస్క్ చేపట్టాడట. సాధారణంగా హీరోల కోసం ఫైట్స్‌కి స్టంట్ డబుల్స్‌ని పెట్టడం రివాజు. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు ఒక్కొక్క యాక్షన్ సీన్‌ని తనే చేయబోతున్నారని టాక్. డేంజరస్ స్టంట్స్‌కి కూడా డబుల్‌లకు అవకాశం ఇవ్వకుండానే జక్కన్న డైరెక్షన్‌లో ప్రిన్స్‌ తనదైన స్టైల్లో స్టంట్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.

దీంతో మహేష్ బాబు మాస్ ఫ్యాన్స్‌కి ఈ అప్డేట్ చాలు.. సినిమా మీద ఎగ్జైట్మెంట్ మళ్లీ డబుల్ అయింది. ఇంకేముంది, మహేష్ రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ విజువల్ వండర్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.