ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా బాహుబలి సినిమా తర్వాత ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఒక్కో సినిమాకు ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుడిగా ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. ఇలా ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో ఆశక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రభాస్ అప్పుల గురించి బయట పెట్టడంతో అభిమానులు షాక్ అయ్యారు. పాన్ ఇండియా స్టార్ హీరో ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్ కి అప్పులు ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రభాస్ బాహుబలి సినిమా చేయకముందు తనకు కొన్ని అప్పులు ఉన్నాయని అయితే రాజమౌళి చేతిలో పడ్డామంటే ఒక రెండు మూడు సంవత్సరాలు బయటకు రావడానికి వీలు ఉండదు అందుకే ఆ అప్పులు తీర్చడానికి ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.
అదే సమయంలోనే తనకు రెబల్ సినిమాలో నటించే అవకాశం రావడంతో రెబల్ సినిమా చేశానని తెలిపారు. ఇలా అప్పులు తీర్చడం కోసమే ఈ సినిమాలో నటించానని ప్రభాస్ తెలిపారు.అదేవిధంగా ఈ సినిమా తర్వాత తనకు మిర్చి సినిమా అవకాశం వచ్చింది. అయితే రెబల్ సినిమాకి జక్కన్న ఒప్పుకున్నారు మరి మిర్చి సినిమాకి ఒప్పుకుంటారా అనే సందేహం కలిగింది. దీంతో రమా గారు ఆయన సినిమా చేయడానికి మరికాస్త ఆలస్యం అవుతుంది అంతలోగా మిర్చి సినిమా చేసేయనీ చెప్పారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ప్రభాస్ నటించిన ఈ సినిమా తన సొంత బ్యానర్ యు వి క్రియేషన్ బ్యానర్ లో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా కావడం విశేషం.