RGV: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టు గురించి ఇటు సినీ పరిశ్రమలోను అటు ఏపీ రాష్ట్ర రాజకీయాలలోను సంచలనగా మారిన సంగతి తెలిసిందే. వర్మ గత ఏడాది క్రితం వ్యూహం సినిమా విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు అయింది. ఇక పోలీసులు వర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈయన హైదరాబాదులో లేరని పోలీసులు ఆయన ఇంటి ముందు పడి గాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వర్మ పరారీలో ఉన్నారని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో వర్మ స్పందించారు. ఇలా వస్తానని అరెస్టు చేయడం కోసం పోలీసులు ఎంతో అత్యుత్సాహం కనబరుస్తున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు.
ఈ సందర్భంగా వర్మ ఈ వీడియోలో మాట్లాడుతూ.. తాను ఎవర్నో ఏదో అంటే వారికి మనోభావాలు దెబ్బ తినడం ఏంటని ప్రశ్నించారు. ఏడాది క్రితం నేను పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ ఈయన ప్రశ్నించారు. అయినా పోలీసులు నాపై పెట్టిన సెక్షన్లు తనకేలా వర్తిస్తాయని ప్రశ్నించారు.పోలీసుల్ని రాజకీయ నేతలు అస్త్రాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. మర్డర్ కేసుల్నే ఏళ్లతరబడి పట్టించుకోరు.. వీటికి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నారు వర్మ.
తాను పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటిస్తున్నారు నేనేమి పారిపోలేదు ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాను. నేను షూటింగ్ ఆపివేసి వస్తే నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి అందుకే కొంత సమయం కావాలి అంటూ పోలీసులకు కూడా నేను సమాచారం ఇచ్చానని వర్మ ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
ఇక ఈయనపై కేసు నమోదు కావడంతో కేసు కొట్టి వేయాలి అంటూ ఈయన కోర్టులో పిటీషన్ వేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్ తోసిపొచ్చింది. ఇకపోతే ముందస్తు బెయిల్ కోసం వర్మ అప్లై చేశారు. ఇక నేడు ఈ పిటిషన్ విచారణ జరగనుంది. మరి కోర్టు ఈయనకు అనుకూలంగా ముందస్తు బెయిల్ ఇస్తుందా లేకపోతే ఈ పిటిషన్ కూడా కొట్టివేస్తూ వర్మ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది.