ఫైనల్ గా గుడ్ న్యూస్ షేర్ చేసిన హీరో శర్వానంద్..తన పోస్ట్ వైరల్.!

Sharwanand Fiancee Rakshita Reddy

అక్కడ బాలీవుడ్ సినిమా దగ్గర స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎలా అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇండియన్ సినిమా దగ్గర నిలిచిపోయాడో తనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో ఏమో కానీ మన తెలుగు సినిమా హీరోలు కూడా చాలా మంది ఇలా బ్యాచిలర్స్ గానే మిగిలిపోయారు.

ఇక వారిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా దగ్గు బాటిలతో పాటుగా మరో హీరో శర్వానంద్ కూడా ఉన్నారు. అయితే వీరిలో కొన్నాళ్ల కితమే బాలయ్య షో లో శర్వానంద్ తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు కానీ ఈ గ్యాప్ లోనే తన నుంచి ఇప్పుడు సినీ వర్గాల్లో ఓ గుడ్ న్యూస్ బయటకి వచ్చింది.

తాను అతి త్వరలోనే పెళ్లిచేసుకోనున్నట్టుగా తన ఫియాన్స్ ని పరిచయం చేసాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అయితే తన జీవితంలో నూతన అధ్యాయం మొదలు పెట్టినట్టుగా తెలిపాడు. అయితే ఈరోజే హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం జరగ్గా అనేకమంది సినీ తారలు కూడా వీరి శుభకార్యక్రమానికి వచ్చారు.

Read more – 

Rajamouli : హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ గా జక్కన్న మహేష్ కాంబినేషన్ సినిమా కథ.. లీకులతో ఫ్యాన్స్ కు కన్ఫ్యూషన్…!

బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “పఠాన్” కి మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.!

కాగా శర్వానంద్ తన లైఫ్ పార్ట్నర్ పేరుని రక్షిత గా పరిచయం చేసాడు. దీనితో తన పోస్ట్ వైరల్ కాగా తన ఫాలోవర్స్ మరియు సినీ ప్రముఖులు ఈ యువ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనితో ఇక మిగతా హీరోల అభిమానులు తమ హీరోలు ఇలాంటి న్యూస్ లు ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నారు. ఇక రీసెంట్ గా శర్వానంద్ ఒకే ఒక జీవితం అనే చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే.