Chiranjeevi: 24 ఏళ్ళ తర్వాత మళ్లీ అలాంటి పాత్రలో కనిపించబోతున్న మెగాస్టార్.. ఏ సినిమాలో అంటే?

‎Chiranjeevi: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అయితే గతంలోనే ఎన్నో ప్రయోగాలు, మంచి సినిమాలు చేసిన మెగాస్టార్ ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారని ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు.

‎కానీ ఇటీవల చిరంజీవి ఒప్పుకున్న నాలుగైదు సినిమాల లిస్ట్ చూస్తే చిరంజీవి తన సినిమాల్లో వ్యత్యాసం చూపించడానికి రెడీ అయ్యారని అర్థమవుతోంది. చిరంజీవి సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో నయనతార, క్యాథరిన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే నేడు దీపావళి పండుగ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

‎ఈ పోస్టర్ లో చిరంజీవి ఇద్దరు పిల్లలతో సరదాగా సైకిల్ తొక్కుతున్నట్టు ఉంది. ఇటీవల ఈ సినిమా కథ టాలీవుడ్ లో వైరల్ అయింది. అయితే ఈ పోస్టర్ తో మరోసారి చర్చగా మారింది. కాగా అనిల్ దర్శకత్వం వహిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార భార్య భర్తలని, వాళ్ళిద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిపోతారని, చిరంజీవి స్పెషల్ ఆఫీసర్ గాఒ ఒక ఆపరేషన్ కి వెళ్తే అక్కడ నయనతార మళ్ళీ కలుస్తుందని, ఈ జంటకు ఇద్దరు పిల్లలు అని, మళ్ళీ ఈ ఫ్యామిలీ ఎలా కలుస్తుంది అని ఎంటర్టైన్మెంట్స్ తో చెప్పనున్నట్టు తెలుస్తోంది. అయితే చాన్నాళ్ల తర్వాత చిరంజీవి ఇందులో తండ్రి పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు పిల్లలకు తండ్రిగా పిల్లలు దూరమైతే ఉండే ఎమోషన్ కూడా సినిమాలో ఉండబోతున్నట్టు టాక్. చిరంజీవి అప్పుడెప్పుడో 24 ఏళ్ళ క్రితం డాడీ సినిమాలో నాన్నగా కనపడి మంచి ఎమోషన్ చూపెట్టారు. ఆ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది. అందులో చిరంజీవి తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తారు. ఆ తర్వాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ లో తండ్రి కొడుకులా కనిపించాడు చిరంజీవి కానీ అది డ్యూయల్ రోల్ కావడంతో కమర్షియల్ సినిమాలా మిగిలింది. మళ్ళీ ఇన్నాళ్లకు చిరంజీవి తండ్రి పాత్రలో ఎమోషన్ చూపించబోతున్నారని తెలుస్తోంది.