Rajamouli : హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ గా జక్కన్న మహేష్ కాంబినేషన్ సినిమా కథ.. లీకులతో ఫ్యాన్స్ కు కన్ఫ్యూషన్…!

Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లిన జక్కన్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు. రెండు నెలలు విరామం తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తాడట రాజమౌళి.ఇక మహేష్ తో సినిమా విషయంలో ఏ చిన్న అప్ డేట్ ను వదలడం లేదు మహేష్ అభిమానులు. ఇక ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్ల దాక ఉంటుందని చెప్తున్నారు.

సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని రాజమౌళి చెప్పడం మరింత అంచనాలను పెంచుతోంది. ఇక ఆర్ఆర్ఆర్ తో జక్కన్న పై మరింత వత్తిడి కూడా పెరుగుతుంది. దాంతో జక్కన్న స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారట. ఇక ఈ సినిమా విషయంలో ఇప్పుడోకా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం దాదాపు పదేళ్ల క్రితమే సెట్‌ అయ్యిందట. `బాహుబలి` కంటే ముందే మహేష్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. మహేష్‌కి, రాజమౌళికి ఆ సమయంలోనే కమిట్‌మెంట్‌ ఏర్పడిందని, కానీ అనుకోకుండా అది సెట్‌ కాలేదని, అప్పటి మాట కోసం రాజమౌళి ఇప్పుడు మహేష్‌తో సినిమా చేస్తున్నట్టు ఇటీవల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సినిమాకి సంబంధించిన స్టోరీ వర్క్ జరుగుతుంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ వర్క్ చేస్తున్నారు. బేసిక్‌ లైన్‌ ఉందని, దాన్ని కూర్చొని వర్కౌట్‌ చేసి కథగా మలచాలని ఇటీవల రాజమౌళి తెలిపారు. కానీ ఇప్పుడు రాజమౌళి మదిలో రెండు స్టోరీలున్నాయట. ఇప్పటికే వినిపిస్తున్న ఓ అడవి నేపథ్యంలో సాహసవీరుడి కథతో ఈ సినిమా ఉంటుందని ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవి నేపథ్యంలో సినిమా సాగుతుందని విజయేంద్ర ప్రసాద్‌ కూడా చెప్పారు. అయితే ఈ కథా మహేష్ తో తీస్తున్న సినిమా కాదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక రాజమౌళి మదిలో మరో కథ కూడా ఉందట. ఇపుడు ఆ కథ మహేష్ తో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి.హాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన విలియమ్‌ వైలర్‌ `బెన్‌హర్‌` సినిమా నుంచి ఇన్‌స్పైర్‌ అయిన స్టోరీ కూడా ఉందని తెలుస్తుంది. 1959లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం `బెన్‌హర్‌` రికార్డులు క్రియేట్‌ చేసింది. అత్యధికంగా ఆస్కార్‌ అవార్డులను అందుకున్న సినిమాగా నిలిచింది. అణచివేతపై స్వేచ్ఛ కోసం, తన ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ వీరుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అలాంటి కథ నేపథ్యంలో మహేష్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే యాంగిల్‌లోనూ జక్కన్న ఆలోచిస్తున్నారట. మరి ఈ రెండింటిలో దేన్ని వర్కౌట్‌ చేస్తారనేది ఆసక్తిగా మారింది.